తెలంగాణకు ఉన్న ఒకేఒక్క గొంతును నొక్కాలని దిల్లీ పెద్దలు చూస్తున్నారు : కేటీఆర్

-

చావునోట్లు తలపెట్టి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్​ది అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ దేశంలో రైతుబంధును పరిచయం చేసిందే కేసీఆర్‌ అని తెలిపారు. 1956లో తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాతో కలిపారని.. ఆనాడు కాంగ్రెస్‌ చేసిన తప్పుకు 50 ఏళ్లు బాధపడ్డామని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పెద్దపల్లిలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ నిర్వహించిన రోడ్​ షోలో పాల్గొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచింది.. కరెంట్‌ పోయిందని.. ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీకి అవకాశం ఇస్తే ఇక్కడ కూడా అదే జరుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్​ కావాలా… కాంగ్రెస్ రాబంధులు కావాలా? ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. డిసెంబర్‌ 3 తర్వాత ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఉన్న ఒకేఒక్క గొంతును నొక్కాలని దిల్లీ పెద్దలు చూస్తున్నారని విమర్శించారు.

“మన్మోహన్‌సింగ్ హయాంలో రూ.400 సిలిండర్‌ ఉన్న సిలిండర్‌ రూ.1200కు పెంచారు. బీఆర్ఎస్​ మళ్లీ గెలిస్తే.. రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తాం. తెల్లరేషన్‌ కార్డు అందరికీ రూ.5 లక్షల జీవితబీమా కల్పిస్తాం.” అని మంత్రి కేటీఆర్ హామీలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news