రైతులకు మేలు చేసే ఉద్దేశం కేసీఆర్‌, హరీశ్‌కు లేదు: రేవంత్‌రెడ్డి

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. రైతు బంధు నిధుల విడుదలకు ఇటీవల అనుమతి ఇచ్చిన సీఈసీ తాజాగా అనుమతిని వెనక్కి తీసుకోవడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే రైతుల సంక్షేమం కోసం ఆలోచించి నిధుల విడుదలకు అనుమతి జారీ చేశామని.. కానీ దాన్ని బీఆర్ఎస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల కోసం వినియోగించడంతో అనుమతిని ఉపసంహరించుకున్నట్లు స్పష్టంచ చేసింది. ఈ క్రమంలో ఈసీ తాజా నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు.

రైతు బంధు నిధుల ఉపసంహరణపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు లేదని అన్నారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత మాత్రమే ఉందని విమర్శించారు. హరీశ్‌ రావు వ్యాఖ్యల వల్ల రైతుబంధుకు ఈసీ అనుమతి రద్దు చేసిందని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరగడానికి కారణం హరీశ్ రావేనని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. 10 రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news