సీఎం రేవంత్ రాష్ట్రంలో నీటి సమస్యలు పరిష్కరించలేకపోతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీటి సమస్యలు తీర్చడం చేతకాక లోటు వర్షపాతం అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14 % ఎక్కువ వర్షపాతం తెలంగాణలో నమోదైందని తెలిపారు. అబద్ధాలు, అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సత్య దూరం మాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తన చూసి తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో నీటి సమస్య ఎక్కువైందని, నీరు లేక పాడి పంటలు ఎండిపోతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్ అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలు ఎత్తిపోస్తే ఈ సమస్య తీరిపోతుందని తెలిపారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని ఆరోపించారు. ఇలాగే ఉంటే మళ్లీ రైతు ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
IMD లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణానికంటే 14% ఎక్కువ వర్షపాతం (excess rainfall) తెలంగాణలో నమోదు అయ్యింది.
నీటి సమస్యలని తీర్చే చేవలేక, చేతకాక .. లోటు వర్షపాతం (deficit rainfall) అని మాట్లాడడం విడ్డూరం!
అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్,… pic.twitter.com/JEemdDqmFe
— KTR (@KTRBRS) March 7, 2024