కోకాపేట్‌లోని వన్ గోల్డెన్ మైల్‌లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ డిజైన్ మరియు డెవలప్‌మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు మంత్రి కేటిఆర్. ఈ సందర్భంగా ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..నాస్కోమ్ లెక్కల ప్రకారం దేశంలో సెమీకండక్టర్ రంగంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాదు నుంచే ఉన్నాయని.. బెంగళూరు చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు.
దేశానికి లైఫ్ సైన్సెస్ కాపిటల్ గా హైదరాబాదు ఉందని.. భారత్ లో అతిపెద్గ మెడికల్ డివైజ్ పార్క్ కూడా హైదరాబాద్ లోనే ఉందని వివరించారు. హైదరాబాద్ ను పోల్ పొసిషన్ తీసుకొచ్చేందుకు మెుబిలిటీ వ్యాలీ ను కూడా తీసుకొచ్చామమని.. భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్స్ అన్నారు. టాస్క్ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామమని.. హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అని తెలిపారు. సెమీ కండక్టర్ రంగంలో హైదరాబాద్ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందని.. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు కేటీఆర్.
IT and Industries Minister @KTRBRS inaugurated @MicrochipTech India design and development centre at Kokapet, Hyderabad.
Microchip Technology Incorporated, Headquartered in Chandler, Arizona, is a leading provider of smart, connected and secure embedded control solutions. The… pic.twitter.com/J0JkYzP2JX
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 3, 2023