చాలా చోట్ల ప్లాస్టిక్ కవర్లని బ్యాన్ చేసినా ఇంకా చాలామంది ప్లాస్టిక్ కవర్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. ప్లాస్టిక్ వలన పర్యావరణం బాగా దెబ్బతింటుంది. పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది అందుకని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ విషయం పట్ల ఉంటే మనం మన పర్యవరణాన్ని కాపాడుకోవచ్చు. మన పర్యావరణం బాగుంటే మనం కూడా బాగుంటాము. పైగా ప్లాస్టిక్ కవర్స్ ని ఉపయోగించడం వలన అవి భూమిలో కలిసిపోవడానికి చాలా ఏళ్లు పడుతుంది.
జంతువులు పక్షులు వాటిని తెలియక తింటే వాటి ప్రాణానికి ప్రమాదం. ఇంత హాని కలుగుతుందని తెలిసినా చాలామంది ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ లని ఉపయోగించడం మానేయాలంటే ఏం చేయాలి అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం.. ప్లాస్టిక్ కవర్ల ని మానేయాలంటే చాలా ప్రత్యాయమ్నాలు ఉన్నాయి.
ప్లాస్టిక్ కవర్లని వాడకుండా ఉండాలంటే బజారుకు వెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ ని తీసుకువెళ్లండి మీరు మీ క్లాత్ బ్యాగ్ ని తీసుకు వెళ్తే కవర్ అవసరమే ఉండదు. పేపర్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ వెదురు బ్యాగులు టోట్ బ్యాగ్స్ సిలికాన్ బాగ్స్ వంటివి మీరు ఉపయోగించవచ్చు ఇటువంటివి ఉపయోగిస్తే పర్యావరణానికి ఎలాంటి హాని కూడా జరగదు. నెమ్మదిగా ఒక ప్లాస్టిక్ కవర్ వాడడం మానేసి తర్వాత క్రమంగా స్ట్రాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఇలా ఒక్కొక్కటి వాడడం మానేస్తే కచ్చితంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించొచ్చు. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవచ్చు.