మంత్రి వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు… ఆయనకి ఏం తెలువదని చురకలు అంటించారు కేటీఆర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని కోరారు. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారని చురకలు అంటించారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో పాల్గొన్న కేటీఆర్… మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదని… ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ గారు గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా?… ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలని సెటైర్లు పేల్చారు. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? అన్నారు.
గతంలో ఇదే కొండా సురేఖ గారు మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే….ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారని తెలిపారు.
ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? అంటూ ఆగ్రహించారు. వాళ్ళు ఏడ్వరా…?? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తానని చురకలు అంటించారు.