BREAKING: హుటాహుటిన కొల్లాపూర్ బయలుదేరిన కేటీఆర్

-

వనపర్తి జిల్లాలో దారుణ హత్య జరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతను హత్య చేసారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో ఈ దారుణ హత్య జరిగింది. లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. పొలం దగ్గర నిద్రిస్తున్న శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

KTR left Kolhapur in a hurry

మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడే ఈ బీఆర్‌ఎస్‌ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని…. హత్యకు గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షతో జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో హుటాహుటిన కొల్లాపూర్ బయల్దేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లి…ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించనున్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news