తీరిన దశాబ్దాల నీటి వెత.. తెలంగాణకు ఇదే సార్థకత: కేటీఆర్

-

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని.. ఎట్టకేలకు పూర్తి చేసిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ ప్రారంభం కానుంది. నార్లాపూర్ పంప్ హౌస్‌లో ఇవాళ మొదటి పంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్విచ్ఛాన్ చేయనున్నారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి పైలాన్‌ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రజల కన్నీళ్లను తుడిచి.. కృష్ణమ్మ నీటితో కాళ్లను కడిగే ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్​పై పలువురు నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్ ! నేడు..సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్..! నాడు ..నది పక్కన నేల ఎడారిలా ..ఎండిన విషాదం ! సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం! బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయం పాలనలో సాహస యజ్ఞం! ఆటంకాలు అవరోధాలు అధిగమించి.. ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి సవాల్ చేసి సాధించిన విజయం! నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం అనుమతుల్లో అంతులేని జాప్యం ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం! తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news