పవన్ కళ్యాణ్ నాకు అన్నలాంటి వాడు : మంత్రి కేటీఆర్

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్‌. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని, అన్నలాంటి వాడని, ఇద్దరి అభిరుచులు కలిసాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఎవరి రాజకీయాలు వారివేనని స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సీఎం జగన్, లోకేష్ కూడా మిత్రులేనని… ఎవరితోనూ ఇబ్బందులు లేవని చెప్పారు.

ఏపీలోనూ ఖచ్చితంగా రాజకీయం చేస్తామని స్పష్టం చేశారు. అక్కడ అసెంబ్లీలో ఎలా ఉన్నా… పార్లమెంటులో అన్ని పార్టీలు బిజెపితోనే ఉన్నాయన్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణ పోలీస్ నియామకాల్లో తప్పులపై చర్యలు తీసుకోవాలి. నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. కీ విడుదలైనప్పుడే అభ్యంతరాలు చెప్పినా… ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. అభ్యర్థులకు న్యాయం చేయాలి. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు కూడా విలువైనది’ అని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news