షాక్ ఇచ్చిన ఫోర్డ్‌.. భారీగా ఉద్యోగుల తొలగింపు

-

కరోనా నుంచి కొన్ని కార్పొరేట్ కంపెనీలను ఆర్థిక మాంద్యం అదరగొడుతోంది. ఈ క్రమంలోనే పలు సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ సంస్థలు భారీగా లే ఆఫ్స్ చేపట్టాయి. తాజాగా ఈ జాబితాలోకి అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ చేరింది. పోర్డ్‌ కంపెనీ తమ సంస్థలోని ఉద్యోగులకు లే ఆఫ్​లు విధిస్తున్నట్లు ప్రకటించింది.

అమెరికా, కెనడాలో ఫోర్డ్‌ సంస్థలో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. వీరిలో రెండు వేల మంది సాధారణ సిబ్బంది కాగా, మిగతా వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులు. లేఆఫ్‌లకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసింది. వీరిలో ఎక్కువ మంది ఉన్నతస్థాయి ఉద్యోగులే ఉన్నట్లు సమాచారం. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్డ్ యాజమాన్యం తెలిపింది. మరోవైపు, భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఫోర్డ్‌ వాహనాలకు డిమాండ్‌ పడిపోవడంతో నిర్వహణ ఖర్చులు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థ.. వీటిని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news