సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పదేళ్ల క్రితం… ఏ చెరువును చూసినా గుండెబరువు వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువు కానీ.. దశాబ్ది ఉత్సవాల వేళ ప్రతి చెరువు… కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువు అంటూ ట్వీట్ చేశారు. చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు… గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు…ముఖ్యమంత్రి కేసిఆర్ గారని తెలిపారు.
చెరువులకు పట్టిన దశాబ్దాల శిలుమునువదిలించిన విప్లవం పేరే.. మిషన్ కాకతీయ అన్నారు కేటీఆర్. “వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా” మెచ్చిన పథకమిది “మిచిగాన్ యూనివర్సిటీ”కి నచ్చిన పథకమిదన్నారు కేటీఆర్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన తరుణమిదని.. పొలిమేరల్లో ఉన్న చెరువును ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇదని వెల్లడించారు. అమృతోత్సవ వేళమన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమైంది..“తెలంగాణ మోడల్” “అమృత్ సరోవర్” రూపంలో దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైంది. మండు వేసవిలో మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా…ఈ మహాయజ్ఞంలో మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి… దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల పండుగ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు కేటీఆర్.
పదేళ్ల క్రితం…
ఏ చెరువును చూసినా గుండెబరువు
వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువుకానీ..
దశాబ్ది ఉత్సవాల వేళ
ప్రతి చెరువు…
కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుచుక్కనీరు లేక చిక్కిశల్యమైన
అమ్మలాంటి ఊరి చెరువుకు
ఊపిరిపోసిన నాయకుడు…గొలుసుకట్టు చెరువుల
గోస… pic.twitter.com/RlS40x3CEY— KTR (@KTRBRS) June 8, 2023