తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఖాళీ గోటికి కూడా సరిపోడని ఎలా అంటావ్ అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలి గోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పెట్టాడా..? అని విమర్శించారు.
కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని హితవు పలికాప్. కాలి గోటికి సరిపోని రేవంత్ రెడ్డి మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 560000 ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసేదే చెబుతాది మీలాగా పూటకు ఒక మాట చెప్పదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జెడ్పిటిసి నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచి అంచలంచలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. కెసిఆర్ యాదాద్రి నుంచి తన ఫామ్ హౌస్ కు పోతుంటే వాసాల మరియు స్మశానాలు అడ్డంగా ఉన్నావని గ్రామాన్ని దత్తత తీసుకొని వదిలేసాడని మండిపడ్డారు.