మీ భార్యాబిడ్డల్ని ఇష్టమొచ్చినట్లు ఫొటో తీస్తే ఊరుకుంటారా : కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు వాడివేడిగా సాగుతున్నాయి. బడ్జెట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ కక్షపూరిత రాజకీయాల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వం తనను అక్రమంగా జైలుకు పంపి వేధించిందని రేవంత్ రెడ్డి అన్నారు. తాను కూడా అలా చేస్తే ఇప్పటికి కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లి ఉండేవారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను అనుకుంటే ఏమైనా చేయగలనంటూ సీఎం బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

మీరేమైనా స్వాతంత్య్ర ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా అంటూ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి డ్రోన్ పంపిస్తే ఊరుకుంటారా.. అక్కడ మీ బిడ్డనో, భార్యనో ఉంటే వాళ్లను ఇష్టం ఉన్నటు ఫొటో తీస్తే ఊరుకుంటారా? మీ కాడికి వచ్చేసరికి కుటుంబాలు, భార్యాపిల్లలు. వేరే వాళ్లకు భార్యాపిల్లలు లేరా. ఆరోజు మా ఇంట్లో మైనర్ పిల్లలను బూతులు తిట్టింది మీరు కాదా? జైలుకు ప్రభుత్వాలు పంపవు.. కోర్టులు పంపుతాయి. దాని మేము ఏం చేయగలం. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగలరు అని ముఖ్యమంత్రి భయపెట్టాలని చూస్తున్నారు. మీరు ఏం అనుకున్నా ఫరక్ పడదు.’ అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version