రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ గుర్తింపు తొలగింపుపై కేటీఆర్ ట్వీట్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం లోగోలో పలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లోగోలో రాచరికపు ఆనవాళ్లున్నాయని, వాటిని తొలగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ రేవంత్ సర్కార్ తీరుపై మండిపడింది. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ ఎక్స్ వేదికగా ఈ విషయంపై స్పందించారు.

హైదరాబాద్ కీ షాన్ అయిన పురాతన కట్టడం చార్మినార్ దశాబ్ధాల తరబడి ఈ మహానగరానికి ఐకాన్గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గురించి ఎవరైనా ఆలోచిస్తే వారి మదిలో మొదటగా మెదిలేది ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలు ఉన్న చార్మినార్ అని తెలిపారు. అలాంటి అద్భుత చరిత్ర ఉన్న చార్మినార్ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. దానికి పనికి రాని కారణాలను సాకుగా చూపుతోందని ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news