కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానిది 5 గంటల ఫెయిల్యూర్ మోడల అయితే తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ది 24 గంటల పవర్-ఫుల్ మోడల్ అని అన్నారు. పదేళ్ల ప్రస్థానం తర్వాత ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన తమదని.. అధికారంచేపట్టి 6 నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం హస్తం పార్టీదని విమర్శించారు.
“ఎన్నికల్లో ఇచ్చిన…. ఐదు హామీలకు పాతరేసి….నమ్మి ఓటేసిన ప్రజల్ని గాలికొదిలేసి తెలంగాణకి వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదు. తెలివైన తెలంగాణ. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని మీరు.. తెలంగాణకి వచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరు.75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే…….. ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే….. వైఫల్యాల కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నమ్మి మోసం చేసినందుకు మీకు సరైన గుణపాఠం చెప్పడం తథ్యం” అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
సిద్ధరామయ్య గారు..
కర్ణాటకలో మీది “5 గంటల.. ఫెయిల్యూర్ మోడల్”
తెలంగాణలో మాది “24 గంటల.. పవర్ – ఫుల్ మోడల్”పదేళ్ల ప్రస్థానం తరువాత కూడా..
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..
ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన మాదిఅధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే…
తీవ్ర వ్యతిరేకత…— KTR (@KTRBRS) November 10, 2023