ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయని.. కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతూ.. జల హారతి పడుతోందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో.. లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయి.. కానీ.. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడిందని కేటీఆర్ పేర్కొన్నారు. కొండంత బలాన్ని చాటిచెబుతోందని.. ఎవరెన్ని.. కుతంత్రాలు చేసినా.. దశాబ్దాలుగా దగాపడ్డ.. ఈ తెలంగాణ నేలకు.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. మేడిగడ్డే… మన రైతుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ అని.. కాళేశ్వరమే… కరువును పారదోలే “కల్పతరువు” అని అన్నారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి కేసీఆర్, తెలంగాణ సమాజం పక్షాన.. మరోసారి సెల్యూట్..!!! అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో..
కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి..
కానీ..
కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం..
సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది..పోటెత్తిన వరదకు దుష్టశక్తుల..
పన్నాగాలే పటాపంచలయ్యాయి..
కానీ..
కేసిఆర్ గారి సమున్నత సంకల్పం..
జై కొడుతోంది.. జల హారతి పడుతోంది…… pic.twitter.com/LcJDXn689C— KTR (@KTRBRS) July 20, 2024