కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదు : కేటీఆర్‌

-

సోషల్ మీడియాలో ఫేక్ ఆర్టీసీ లోగోను వైరల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా డీజీపీ రవి గుప్తా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న వారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని నిలదీశారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.

ఇక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఫేక్ లోగోను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. TSRTC కి బదులుగా TG RTC అంటూ ఇద్దరు వ్యక్తులు ఫేక్ వీడియోను తయారుచేసి వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు  మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు

Read more RELATED
Recommended to you

Latest news