నారా లోకేష్ ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని కొత్త డిమాండ్ ను బుద్దా వెంకన్న తెరపైకి తీసుకొచ్చారు నారా లోకేష్ ని పార్టీ అధ్యక్షుడుగా నియమించాలి.. ఇది నా డిమాండ్ అంటూ తేల్చి చెప్పారు. లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేసే హక్కు నాకుందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్ అధ్యక్షుడుగా నియమించాలని డిమాండ్ చేశారు. లోకేషుని అధ్యక్షుడుగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో 130 స్దానాలు కూటమికి వస్తాయని…అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువ నేశ్వరి డిసైడ్ చేస్తారని కూడా తెలిపారు బుద్దా వెంకన్న.చంద్రబాబు ఆత్మ కధలో నా కో పేజీ ఉంటుంది….టిక్కెట్ కోసం రక్తంతో చంద్రబాబు కాళ్లు కడగలేదని వివరించారు. ఓడాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా నేను నిలబడ్డానని వెల్లడించారు.