తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. “హైట్రిక్ లోడింగ్ 3.0… వేడుకలకు సిద్ధం కండి” అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కార్యకర్తలు నాయకులలో మంత్రి కేటీఆర్ జోష్ నింపారు. అటు అంతకుముందు… ప్రగతి భవన్ కు రంగులు వేసింది కెసిఆర్ ప్రభుత్వం.

మూడోసారి కూడా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని సంకేతం ఇస్తూ… రంగులు వేశారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్స్… ఇచ్చిన తరుణంలో భారత రాష్ట్ర సమితి పార్టీ అగ్రనేతలు మాదే విజయం అని స్పష్టం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. మరి ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో ఇవాళ మధ్యాహ్నం తేలిపోనుంది.