దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అంటూ షాద్ నగర్ సంఘటనపై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అంటూ ఆగ్రహించారు కేటీఆర్. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! అంటూ రెచ్చిపోయారు. ఇంత కర్కశత్వమా… సిగ్గు సిగ్గు..! కొడుకు ముందే చిత్ర హింసలా? అంటూ మండిపడ్డారు కేటీఆర్.
రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా? ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో…మహిళలంటే ఇంత చిన్నచూపా..! అంటూ ప్రశ్నించారు.ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు అని… మరోవైపు దాడులు, దాష్టీకాలు..! అంటూ ప్రశ్నించారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు… ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే..పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారని నిప్పులు చెరిగారు కేటీఆర్. బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.