ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తారు. నేడు.. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్ నోటీసులు.. ఇంత మోసం, పచ్చిదంగా, నయవంచన’ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
కేటీఆర్ ట్వీట్ పోస్ట్ పై నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. రేవంత్ మాటలు నమ్మి బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నామని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 2 లక్షల రుణ మాఫీ ఉత్త మాటేనా? లోన్లు కట్టాలని రైతలకు లీగల్ నోటీసులు బ్యాంకులు పంపుతున్నాయని, ఆ రోజులే బాగుండేరా అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.