వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైసిపి వ్యతిరేక ఓటు చీల్చనిపోమని గతంలోనే చెప్పానని రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీకి ముఖ్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. టిడిపి జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసిన అనంతరం లోకేష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మధ్య నిషేధం చేస్తామని చెప్పిన వైసిపి ప్రభుత్వం విచ్చలవిడిగా మధ్యనే అమ్ముతుందన్నారు.. ఈ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుందని ఆ తెగులు పోవాలంటే టిడిపి జనసేన వ్యాక్సిన్ అవసరం అన్నారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారు సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో మేము భేటీ అయ్యామని ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిసామని స్పష్టం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాము టిడిపి జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం త్వరలోనే కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.