సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అందులో కవితలు, పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, గజల్ లు, వ్యాసాలు, సినిమా పాటలు, రూపం ఏదైనా సినారె కలానికి తిరుగులేదు. కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీ గేయ రచయిత. పాత్ర ఏదైనా సినారె ప్రతిభకు సాటిలేదు. ప్రపంచ సాహితీ లోకానికి మన తెలంగాణ గడ్డ అందించిన ఆణిముత్యం సింగిరెడ్డి నారాయణరెడ్డి.

తన పాండిత్యంతో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన సినారె తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ధ్రువతారగా నిలిచిపోయారు. తన రచనలతో తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త బాణీని సృష్టించారు. జ్ఞానపీట్ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వారిని వరించినా, రాజ్యసభ ఎంపీ తో పాటు ఎన్నో గొప్ప పదవులను వారు అలంకరించినా ఇవన్నీ సినారె సాహితీ సేవ ముందు దిగదుడువుగా మిగిలిపోయాయి. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు అక్షర నివాళులు అర్పిస్తున్నాను అని మాజీ మంత్రి కేటీఆర్ రాసుకొచ్చాడు.