తెలంగాణ రైతులకు శుభవార్త..లక్ష దాటిన వారికి కూడా రుణమాఫీ

-

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్‌ రావు. లక్ష దాటిన వారికి కూడా రుణమాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు హరీష్‌ రావు. మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల త్వరలో చేయబోతుందని ప్రకటించారు. మొత్తంగా నెల లోపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయనుందన్నారు.

ఈ నెల 14 నుంచి లక్ష లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. సోమవారం నాడు లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల రుణమాఫీ చేస్తామని… లక్ష రూపాయల పైన తీసుకున్న రుణాలను మరో 15 నుంచి 20 రోజుల్లో మాఫీ చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఆగమాగం ఉంది వాళ్ళకి దిక్కు లేకుండా అయిపోయిందని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version