ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం పీకుతున్నారంటూ ఖమ్మం వరద బాధితులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో వరదలు భారీగా వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారని.. వాళ్లు ఏం చేయడం లేదని ఫైర్ అవుతున్నారు ఖమ్మం వరద బాధితులు. పోలీసులు, అధికారులు, మంత్రులు ఎవ్వరు ఏ సహాయం చేయడం లేదు.. తొమ్మిది మంది ఇంకా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నారు..వాళ్లని ఎవ్వరు కాపాడుతారు, ఎప్పుడు కాపాడుతారని నిలదీశారు.
ఇక అటు ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మందిని జేసీబీతో కాపాడుకున్నారు స్థానికులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే పని అవదని ప్రకాష్ నగర్ వంతెన మీద చిక్కుకున్న 9 మందిని జేసీబీ సాయంతో బయటకు తీసుకుని వచ్చారు స్థానికులు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఆదుకునే నాధుడే లేక పోలీసులతో వాగ్వాదానికి దిగి మరీ జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకుని వచ్చారు స్థానికులు. పక్క రాష్ట్రం ఏపీ నుంచి తుమ్మల గారు తెస్తానన్న రెండు ఎలికాఫ్టర్లను వెనక్కి తీసుకుని వెళ్ళమని చెప్పమనండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
https://x.com/MirrorTvTelugu/status/1830290824925741458