తెలంగాణలో విజృంభిస్తోన్న లంపీస్కిన్ వ్యాధి

-

జికా, ఎబోలా, కరోనా, ఒమిక్రాన్, మంకీపాక్స్ వైరస్ లు మానవాళిని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు పశువులపై తన పంజా విసురుతోంది లంపీస్కిన్ వ్యాధి. ఇప్పటికే ఉత్తర భారతంలో ప్రకంపనలు సృష్టించిన ఈ వ్యాధి ఇప్పుడు తెలంగాణకూ సోకింది.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లోని పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి ఎల్ఎస్​డీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 255 గ్రామాల్లో లంపీస్కిన్ వ్యాధి ప్రభావం కనిపిస్తున్నట్లు పశుసంవర్థక శాఖ వెల్లడించింది. లంపీస్కిన్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వ్యాధినిరోధక చర్యలకు ఉపక్రమించాయి.

రాష్ట్రంలో రోగ లక్షణాలు గల పశువులను గుర్తించి పశు వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదా అనారోగ్యంగా ఉన్న ఆవులు, గేదెలకు తగిన చికిత్స అందిస్తూ ఐసోలేషన్‌లో పెట్టి మిగతా మందలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ విజ్ఞప్తి మేరకు ఔషధాల కోసం ప్రభుత్వం 15 కోట్ల మంజూరుకు అనుమతిచ్చింది. గతంలో 3 కోట్లు వెచ్చించింది. సాధారణంగా ఒక పశువుకు లంపీస్కిన్‌ వ్యాధి బారినపడితే దానికి టీకా ఇచ్చి ఐసోలేషన్‌లో ఉంచి చుట్టు పక్కల 5 కిలోమీటర్ల దూరం వరకు పశువులకు రింగ్ వ్యాక్సినేషన్‌ చేపట్టింది. రాష్ట్రంలోని పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి అదుపులో ఉందని పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్.రాంచందర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...