బీఆర్ఎస్ నాయకత్వంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని కేటీఆర్ చెప్పారు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. దమ్ముంటే, సత్తా ఉంటే, మగాడివి అయితే.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు రా.. సీఎం పదవికి రాజీనామా చేసి రా.. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు.. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను.
మల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం అంటే అప్పట్నుంచి సడిచప్పుడు లేదు. అందుకే అంటున్నా మగతనం అంటే ఎలక్షన్లు గెలుచుడు కాదు.. మగాడివి అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో. దమ్ముంటే మార్చి 9వ తేదీ వరకు రుణమాఫీ చేసి చూపించు. పంటలకు నీళ్లు ఇవ్వు.. రైతు భరోసా ఇవ్వు.. మహాలక్ష్మి కింద మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నావు.. దమ్ముంటే ఈ పనులు చేసి చూపించు. నోటికొచ్చిన సొల్లు పురాణం చెప్పుడు కాదు. ప్రజలను కించపరించే విధంగా చిల్లర మాటలు మాట్లాడడం కాదు. ప్రజలు మంట మీద ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఆగం చేసిందనే కోపం మీద ఉన్నారు అని కేటీఆర్ తెలిపారు.