బీసీల కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ : మహేష్ కుమార్

-

దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారు. ధైర్యంగా బీసీల కులగణన గురించి మాట్లాడుతున్న ఛాంపియన్ రాహుల్ గాంధీ. ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చాం అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు. డిక్లరేషన్ ను ప్రవేశ పెట్టే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి నాకే ఇచ్చారు. డిక్లరేషన్ కు ముందు కొన్ని మార్పుల కోసం కూర్చుంటే మీరు చేయండి నేను ఉన్నాను అని రేవంత్ చెప్పారు. కులగణన జరగనది రాష్ట్రంలో ఎన్నికలు అసలు జరగవు.. అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టాం. మరో నాలుగైదు రోజుల్లో కులగణనకు సంబంధించిన విధివిధానాలు రావొచ్చు. కులగణనపై ఎటువంటి అపోహలు వద్దు.. పీసీసీగా చెప్తున్నా.. కులగణన చేయకపోతే నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ కు చెప్పాను.

కులగణనపై రేవంత్ ఒప్పుకున్నారు.. ముందుకు వెళ్దాం అని సీఎం అన్నారు. కులగణన మాట తీయగానే BRS వాళ్లు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ కులగణన వ్యతిరేకిస్తుంది.. బీసీ ప్రధానిగా ఉన్నాడు అని బిజెపి చెప్తుంది.. ఏ బీసీకి న్యాయం జరిగింది. BRS తమ పార్టీ అధ్యక్షుడ్ని మార్చగలదా.! బీసీని అధ్యక్షుడుని చేయగలదా. కానీ బీసీల కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్.. రాహుల్ గాంధీ మది నుంచి వచ్చిన ఆలోచన. నేను.. సీఎం ఎవరైనా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే నడుచుకుంటాం అని మహేష్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news