నిరు పేదలను ఏడిపిస్తే ప్రభుత్వానికి మంచిది కాదు : ఈటల

-

గ్రేటర్ హైదరాబాద్‌లో మూసీ నది సుందరీకరణలో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటున్న నిరుపేదల ఇండ్ల కూల్చివేతల కోసం చేపట్టిన సర్వే ఆందోళనలకు దారి తీసింది. ఇప్పటికే పలుచోట్ల సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్దుకోవడంతో పాటు ప్రశ్నలు సంధిస్తున్నారు. గత 2 రోజులుగా గోల్కొండ, ఇబ్రహీంబాగ్, లంగర్ హౌజ్, పాతబస్తీ, చాదర్‌ఘాట్, శంకర్ నగర్, అంబర్‌పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, మారుతీనగర్,సత్యానగర్,ఫణిగిరికాలనీ,ఇందిరానగర్,గణేష్‌పురి తదితర ప్రాంతాల్లో అధికారులు బందోబస్తు నడుమ సర్వే చేస్తున్నారు.ఈ క్రమంలోనే హైడ్రా బాధితులు శుక్రవారం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు.

తమ నిర్మాణాలను కూల్చొద్దని,ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నామని వారి గోడును వెల్లబోసుకున్నారు.ఈటల మాట్లాడుతూ..నిజాం సర్కార్ కంటే దారుణంగా, దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంపీ ఫైర్ అయ్యారు.కూల్చివేతల కారణంగా నిరుపేదలు గత 2 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా జీవనం సాగిస్తున్నారని విమర్శించారు. గతంలో సంజయ్ గాంధీ కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేయించాడని గుర్తుచేశారు.నిరుపేదల కంట నీరు ప్రభుత్వానికి కూడా మంచిది కాదని.. దీనిపై పునరాలోచన చేయాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news