మల్కాజిగిరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కు కేంద్రంలో కీలక పదవి దక్కింది. లోక్ సభ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్ కు చైర్మన్ గా మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా హర్యానాలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్….కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తుందని హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో తేలిపోయిందని వివరించారు.
హామీలు ఇవ్వడమే తప్ప వాటిని నెరవర్చకుండా ప్రజలని మోసం చేయడం కాంగ్రెస్ నైజం. ఎన్ని అడ్డదారులుతొక్కైన అధికారంలోకి రావాలనే ప్రయత్నం హర్యానా ఎన్నికల్లో పారలేదని సెటైర్లు పేల్చారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి హిమాచల్ ప్రదేశ్ చేరిందని… బీజేపీ పని అయిపోయిందని కాంగ్రెస్ చేస్తున్న అబదపు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. బిజెపి వస్తే రిజర్వేషన్లు పోతాయని అబద్ధపు ప్రచారం చేశారని… కాంగ్రెస్ చేస్తుంది విష ప్రచారం అని ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.