maloth kavitha :నేను పార్టీ మారడం లేదు..కేసీఆర్ తోనే ఉంటానని ప్రకటించారు మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. నేను పార్టీ మారడం లేదు….నాపైన రాజకీయ అత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత.
నేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారు…నేను పార్టీ మారను… పోటీలోనే ఉంటానని వెల్లడించారు. పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి అని చెప్పారు. కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని వెల్లడించారు మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు.