న్యాయం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించాం: మందకృష్ణ మాదిగ

-

ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని పేర్కొంది. ఈ తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక స్పందించారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పానని గుర్తు చేశారు. అధర్మమే తాత్కాలికమైనా.. ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పానని అన్నారు. న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామని పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని తెలిపారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎమ్మార్పీఎస్‌ పోరాడిందని.. 30 ఏళ్ల పోరాటంలో ఎంతోమంది ఎమ్మార్పీఎస్‌ నేతలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎమ్మార్పీఎస్‌ నేతలకు ఈ విజయం అంకితం అని చెప్పారు. అనుకూల తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ప్రక్రియను ముందుకు నడిపించిన వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి కూడా మందకృష్ణ థాంక్స్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news