ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ అంశం పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పు వెల్లడించింది. 

దీనిపై తాజాగా అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇదే శాసనసభలో వాయిదా తీర్మాణం ఇస్తే.. నాతో పాటు సంపత్ ను సస్పెండ్ చేసినట్టు గుర్తు చేశారు. అప్పుడు మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది.  ఈనాడు మాదిగ, మాదిగ ఉప కులాల వర్గీకరణ చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉప కులాల యువకులు పోరాటం చేశారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణ బాధ్యతను తమ ప్రభుత్వం అందరికంటే ముందు తీసుకుంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

 

 

Read more RELATED
Recommended to you

Latest news