కృష్ణా ఎగువన కురస్తున్నభారీ వర్షాలు.. శ్రీశైలం ప్రాజెక్టు 7గేట్లు ఎత్తివేత

-

కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రాజెక్టులకు మరింత వరద నీరు వచ్చి చేరనుంది.

ఇప్పటికే రాష్ట్రంలోని మేజర్ ప్రాజెక్టులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. అయితే, కృష్ణా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో ప్రాజెక్టు 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 2,62,462 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,65,233 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంది. మరోవైపు వరద వస్తుండటంతో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news