రైలు ప్రయాణికులకు అలర్ట్… అంతర్గత పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని కరగ్ పూర్-భద్రక్ సెక్షన్ పనులు కొనసాగుతుండగా… 18, 19 తేదీల్లో పది రైళ్ళను రద్దు చేసింది.
వాటిలో శాలిమార్-సికింద్రాబాద్ 18045, సికింద్రాబాద్-శాలిమార్ 18046, సంత్రగాచి-తిరుపతి, తిరుపతి-సంత్రగాచి, గౌహతి-సికింద్రాబాద్, హౌరా-పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్-సంత్రగాచి, మైసూర్-హౌరా, సికింద్రాబాద్-అగర్తల, ఎర్నాకులం-హౌరా రైళ్లు ఉన్నాయి.
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 3,645 ఆలయాలను ధూపదీప నైవేద్య పథకం కిందకు తీసుకురాగా… తాజాగా గ్రామాల్లో 2,043 ఆలయాలకు ఈ పథకం వర్తింపజేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ధూపదీప నైవేద్యం కింద ఆలయాలకు రూ.6000 ఇస్తున్నారు. వీటిలో రూ. 4000 అర్చకుడికి వేతనంగా… మిగిలిన రూ.2వేలు ఆలయంలో ధూపదీప నైవేద్యానికి ఖర్చు చేస్తారు. దీన్ని రూ. 10 వేలకు పెంచుతున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.