కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక, 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం – భట్టి ప్రకటన

-

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన చ ఏశారు కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. బీఆర్ఎస్ నేతల అసమర్ధత వల్లే నల్గొండ జిల్లాకు కృష్ణా నీళ్లు రాలేదని…. సాగునీళ్ళు ఎందుకు తీసుకురాలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీస్తే స్పందన విచిత్రంగా, విడ్డూరంగా ఉందని వివరించారు.

సాగునీటి ప్రాజెక్టు కోసం గుత్తా సుఖేందర్రెడ్డి స్వరాష్ట్రలో సీఎంను ఎందుకు నిలదీయరు….? పదవులకు ఎందుకు రాజీనామా చేయరు….? అని నిప్పులు చెరిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ హయాంలోని మాత్రమే అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పదవుల కోసం… అధికారం కోసం టిడిపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మారిన వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారా.. అని నిలదీశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు గుత్తా సుఖేందర్ రెడ్డి పదవుల కోసం పార్టీల చుట్టూ తిరుగుతున్నాడని ఆగ్రహించారు.

నల్గొండ జిల్లా పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని గజ్వేల్ గఢీ దగ్గర తాకట్టు పెట్టారు బీఆర్ఎస్ నేతలు… అభివృద్ధి జరగడానికి, ఉపాధీ అవకాశాలు పెరగడానికి.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని… రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి ఐదు లక్షల పెంచుతామని ప్రకటించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని… ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని… కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news