షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతామంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతామన్నారు. వెలమ కులస్థులు బయట తిరుగకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ పై కుట్రలు పన్నితే.. దాడులు చేస్తామని పేర్కొన్నారు.
దీంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై దోమల గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించడంతో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు పిర్యాదు చేసారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెలమ సంఘం ఖండిస్తుందని తెలిపారు. వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.