బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, ఈ వివాహాలు బాలికల జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయి అన్నారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. బాల్య వివాహాల పై అవగాహన కల్పించేందుకు ఓ పోస్టర్ ను ఆవిష్కరించారు మేయర్. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల అమ్మాయిల జీవితాలు నాశనమవడమే గాక సమాజం పై ఆ ప్రభావం ఉంటుంది అని తెలిపారు. అలాగే బాల్య వివాహం చేసుకున్న వారే కాకుండా, అలాంటి వివాహాలకు మద్దతు తెలిపిన వారు, పాల్గొన్నవారు కూడా శిక్షార్హులవుతారు అని స్పష్టం చేసారు.
బాల్య వివాహంతో పేదరికం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు పెరుగుతాయి అని పేర్కొన మేయర్.. ఇక వాటి వల్ల కుటుంబాల్లో నిరక్షరాస్యత, హింస మరింత పెరుగుతున్నాయి. బాల్య వివాహాల్లో పాల్గొన్న తల్లిదండ్రులు, బంధువులు కూడా చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు అని చెప్పారు. అలాగే ఈ వివాహాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది అని సూచించారు మేయర్ విజయలక్ష్మి.