మేడారం జాతరకు వెళ్లలేకపోతున్నారా.. ఆన్‌లైన్‌లో మొక్కులు చెల్లించుకోండిలా

-

మేడారం జాతరకు వెళ్లలేకపోతున్నారా. అంత రద్దీలో అమ్మవార్లకు మొక్కులు ఎలా చెల్లించుకోవాలా అని ఆలోచిస్తున్నారా. మీకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మేడారం వెళ్లలేకపోతున్నామని బాధ పడకుండా ఆన్‌లైన్‌లోనే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు బంగారం చెల్లించుకోవచ్చు. అదెలాగా అంటారా. ఈ స్టోరీ చదివేయండి మరి.

మేడారం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలను దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇవాళ ప్రారంభించారు. మేడారం వెళ్లలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లాన్ని సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించారు. మీసేవ, పోస్టాఫీసులతో పాటు టీ యాప్ ఫోలియో యాప్ ద్వారా కిలోకు 60 రూపాయలు చెల్లిస్తే అమ్మవారి గద్దెల వద్ద బెల్లాన్ని సమర్పిస్తారు. ప్రసాదం కోసం ఈ యాప్‌ల ద్వారా డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. ఏడాదంతా బంగారం సమర్పణ సేవలు కొనసాగుతాయి. వివిధ కారణాలతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news