ఈ రోజు ఓ మోస్తరు వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతవారణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం వచ్చేలా ఉందని తెలంగాణ వాతవరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేగాక గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే రేపు, ఎల్లుండి కూడా ఇలాగే ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుందని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు మొదలు కావడంతో ఇప్పటి నుంచి వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.