హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో రెండో దశ విస్తరణపై ఎండీ కీలక వ్యాఖ్యలు

-

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించి.. ఆయన మాట్లాడుతూ.. రెండో దశ ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం స్పష్టం చేశారు. శంషాబాద్ విమనాశ్రయాన్నికలుపుతూ 70 కిలోమీటర్ల పొడవునా విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. సెకండ్ ఫేజ్ కారిడార్ కోసం వేగంగా ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్ ల తయారీ జరుగుతుందన్నారు.

రెండో దశ కారిడార్ లో అన్ని వర్గాలకు అందుబాటులో మెట్రో ఉంటాయని శుభవార్త చెప్పారు. మెట్రో విస్తరణతో నగర ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు దోహదపడుతాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ కింద మొత్తం 70 కిలోమీటర్ల వరకు రైలు మార్గాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పూర్తి అయ్యాయి. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంబీబీఎస్ వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడగించనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేవిధంగా కొత్త రూట్ మ్యాప్ రూపొందించినట్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news