తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. పదో తరగతి విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పదవ తరగతి పరీక్ష రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్.

ప్రభుత్వ పాఠశాల ఎగ్జామ్స్ సెంటర్ అయి ఉంటే… అందులో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే వారికి కూడా భోజనం పెట్టి పంపించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈనెల 21వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీ వరకు కొనసాగనన్నాయి. అయితే పదవ తరగతి విద్యార్థులకు కూడా… మధ్యాహ్న భోజనం అందిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.