ఇలా చేస్తే బియ్యానికి పురుగు పట్టదు..!

-

రోజు రోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మధ్య తరగతి వారు బియ్యం వంటి ఆహార ధాన్యాలను సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొని నిల్వ చేయడం అందరికీ తెలిసిందే. అయితే వాటిని ఎలా నిల్వ చేయాలో అందరికీ తెలీదు. కొత్తలో అవి బాగా ఉన్నకాని తర్వాత కొన్నాళ్లకు వాటిలో పురుగు పట్టి పాడవుతాయి. అలా కాకుండా సంవత్సరం అంతా పురుగు పట్టకుండా ఎలా నిల్వ చేయాలో చూద్దాం.

బియ్యం బస్తాలు ఎక్కువ సంఖ్యలో నిల్వ చేసేటప్పుడు బియ్యానికి తేమ తగలకుండా జాగ్రత్త పడాలి. బియ్యానికి తేమ చేరితే రంగు మారి త్వరగా పాడవుతాయి.బియ్యం బస్తాలు వేసేటప్పుడు ఆ ప్రదేశంలో చీమల మందు చల్లి పెట్టుకోవాలి.బియ్యం బస్తాలు ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు మధ్యలో ఎండిన వేపాకు వేసి నిల్వ చేస్తే పురుగు పట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

వాడుకోవడానికి బియ్యం డబ్బాలో పోసుకునేటప్పుడు డబ్బా శుభ్రం చేసి బియ్యం లో ఎండుమిరపకాయలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.కొంచెం మోతాదులో బెల్లం కానీ, పొగాకు కానీ బియ్యంతో పాటు ఉంచిన పురుగులు దరిచేరవు.రాతి ఉప్పును శుభ్రమైన బట్టలో చిన్న మూట కట్టి బియ్యం డబ్బాలో ఉంచిన బియ్యం పాడవకుండా ఉంటాయి.

ఆయుర్వేద దుకాణాల్లో దొరికే బైద్యనాద్, పారద్ గుళికలు బియ్యంలో కలిపితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.అందరికీ అందుబాటులో ఉన్న ఇలాంటి వాటిని ఉపయోగించి బియ్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. బోరిక్ యాసిడ్ లాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలాంటి వాటిని ఉపయోగించి బియ్యాన్ని నిల్వ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news