BREAKING : తెలంగాణ రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు ఊహించని షాక్ తగిలింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయిందని సమాచారం అందుతోంది. దామోదర ఫేస్ బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్నారు కొంత మంది కేటుగాళ్ళు.
అంతేకాదు..బిజెపి, టిడిపి, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ లో వందల సంఖ్యలో పెట్టారు కేటుగాళ్ళు. ఈ తరుణంలోనే… మంత్రి దామోదర ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని కార్యకర్తలకు మనవి చేస్తున్నారు ఆయన అనుచరులు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.