IND VS AFG :అదరగొడుతున్న అక్షర్.. T20 WCలో చోటు ఖాయం?

-

ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీం ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్నారు. దీంతో అతనికి T20 WC టీమ్ లో చోటు దక్కడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కుల్దీప్, బిష్నోయ్, సుందర్ లతో పోల్చితే అతనికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

axar patel into t20 world cup 2024
axar patel into t20 world cup 2024

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచుల్లో అక్షర్ 23/2, 17/2తో రాణించారు. ఇది ఇలా ఉండగా, టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా ధోని(41) సరసన నిలిచారు. ధోని 72 మ్యాచుల్లో, రోహిత్ 53 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు అలాగే అత్యధిక టీ20 సిరీస్ లు(12) గెలిచిన భారత కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news