రేషన్ డీలర్లతో మంత్రి గంగుల భేటీ

-

రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది. డీలర్లు చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తికే సదరు రేషన్ షాప్ ని కేటాయించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, కనీస గౌరవ వేతనంగా 30 వేలు, ఆరోగ్య కార్డుల పంపిణీ తో పాటు శాశ్వత ప్రాతిపదికన రేషన్ డీలర్ షిప్ ను కేటాయించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించేందుకు వారితో మంత్రి గంగుల కమలాకర్ నేడు సచివాలయంలో భేటీ అయ్యారు. పెంపు అంశంపై సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ డిమాండ్లను త్వరగా పరిష్కరించకపోతే తెలంగాణ ఉద్యమం మాదిరిగానే సమ్మె, మానవహారాలు, వంటావార్పు, చలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని రేషన్ డీలర్లు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news