పక్కింట్లో పూలు కోసుకొచ్చి పూజలు చేస్తున్నారా..? పుణ్యం కాదు పాపం

-

దేవుడికి పూజ చేసేప్పుడు పూలు కచ్చితంగా ఉండాలి. కొంతమంది పూలు కొనుకొస్తారు, మరికొందరు పక్కింట్లో ఉంటే కోసుకొచ్చి పూజ చేస్తారు. హిందూధర్మం ప్రకారం.. పూజలో చేసే ప్రతి క్రతువు వెనుక గొప్ప అర్థం ఉంది. మీరు పూజకు కోసే పూలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. పూలు కోసేప్పుడు మాట్లాడకూడదు, దేవుడి నామ స్మరణే చేయాలి, కిందపడిన పూలతో పూజించకూడదు ఇలా చాలా ఉంటాయి. అయితే పూజ కోసం పక్కింటో పూలు కోసేవాళ్లు చాలా మంది ఉంటారు. వారి కోసమే ఈ ఆర్టికల్‌.

రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజకోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూలచెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నారనుకోండి… వాళ్లకేసి సీరియస్‌గా చూస్తూ..వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం.

ఇక ఆ ఇంట్లో వాళ్లని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది. పూలుకోసుకున్నప్పడు కూడా ఇంటి యజమానిని అడగాలి…అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది. ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి

వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి. మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటారు. పూలు కోసుకురావడం తప్పుకాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడమే తప్పు. అలాగే చెట్టుకు పూలు కోసేప్పుడు ఎప్పుడూ పూర్తిగా కోయకూడదు. కొన్ని ఉంచాలి. బోసి చెట్టుగా చేయడం మహా పాపం.! కాబట్టి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news