ఆంధ్ర నాయకుల కోసం రేవంత్ రెడ్డి పిట్టలదొర అవతారం ఎత్తారు – మంత్రి జగదీష్ రెడ్డి

-

యాదాద్రి జిల్లా రామన్నపేటలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులలో బాధ్యతలు తెలిసినవాళ్ళు లేరని.. అదే దుర్దుష్టం అని అన్నారు. రాష్టం పుట్టుక ఇష్టంలేని ప్రధాని నాయకత్వం వహిస్తున్న పార్టీ ఇప్పుడు సంబరాలు చేస్తా అనడం చావకొట్టినోడే దినం చేస్తా అన్నటుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది బిఅరెస్ పార్టీ అని.. అందుకే తెలంగాణ సంబరాలు చేసుకునే హక్కు బిఅరెస్ పార్టీకె ఉందన్నారు. ఆంధ్ర నాయకుల కోసం…. పిట్టల దొర అవతార మెత్తిన నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ప్రదాని మోడి, రాహుల్ గాంధీ పెయిల్యూర్ అయ్యారని.. కానీ తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ సెక్సస్ అయ్యాడని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news