అబద్ధాల్లో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వచ్చు – సజ్జల

-

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేనిఫెస్టో పై స్పందించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు మేనిఫెస్టోలోని హామీలు దరిద్రంగా ఉన్నాయని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. మేం అమలు చేస్తున్న హామీలను కూడా కాపీ కొట్టి ఇందులో పెట్టారని ఆరోపించారు.

అరాచకం, అవినీతిలో చంద్రబాబు కొత్త రికార్డు క్రియేట్‌ చేశారని అన్నారు. చంద్రబాబు గతంలో ఏం చేశాడో చెప్పుకోడానికి కూడా ఏమీ లేదన్నారు. ఇది చేశాం అని మేం చెప్పుకోగలుగుతున్నామని.. మరి చంద్రబాబు ఏం చెబుతారు? అని ప్రశ్నించారు. అబద్దాల్లో చంద్రబాబుకు గిన్నీస్‌ రికార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు సజ్జల. 2014 – 19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు అవినీతి అరాచకం లో కొత్త రికార్డులు క్రియేట్ చేశారని విమర్శించారు. 14…

Read more RELATED
Recommended to you

Latest news