‘అలా జరగకపోతే రాజకీయం వదిలేస్తా.. నువ్వు రెడీనా కేటీఆర్?’

-

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సవాళ్ల యుద్ధం సాగుతోంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన సవాల్ కు కేటీఆర్ సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తే కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంతో మొదలు పెట్టి వరుసగా ఐదు హామీలు అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news